మళ్లీ 'జీన్స్' కాంబినేషన్ కి ప్రయత్నాలు!

Jeens combo to be revived in Tamil
షార్ట్స్‌లో చూడండి
సుమారు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'జీన్స్' సినిమా మంచి వినోదాన్ని ఇస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రశాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా నటించారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ జంట మరో సినిమాలో కనువిందు చేసే అవకాశం కనిపిస్తోంది.

హిందీలో వచ్చిన 'అంధాదున్' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. సీనియర్ హీరో ప్రశాంత్ ఇందులో కథానాయకుడుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో నెగటివ్ టచ్ తో కూడిన ఓ కీలక పాత్ర వుంది. హిందీలో టబు ఆ పాత్రను పోషించింది. ఇప్పుడు తమిళంలో ఈ పాత్రకు గానూ ఐశ్వర్య రాయ్ ని అడుగుతున్నారట.

ఈ విషయంలో ప్రస్తుతం ఐశ్వర్యతో సంప్రదింపులు జరుపుతున్నామని, అయితే, ఆమె నుంచి ఇంకా నిర్ణయం రాలేదనీ చిత్ర నిర్మాత, ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ చెప్పారు. ఐశ్వర్య అయితే ఆ పాత్రకు బాగా సూటవుతుందని, సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని ఆయన నమ్మకం.

ఇదిలావుంచితే, తెలుగులో ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. నితిన్, నభా నటేష్ జంటగా నటిస్తున్న ఈ తెలుగు వెర్షన్లో ఆ కీలక పాత్రను తమన్నా పోషిస్తోంది. త్వరలోనే ఈ తెలుగు వెర్షన్ షూటింగ్ మొదలవుతుంది. 
Go Back to Shorts
Aishvarya Rai
Prashanth
Nithin
Tamannaah

More Telugu News