విజయనగరంలో బొత్స ఇంటిని ముట్టడించిన విద్యార్థులు... ఉద్రిక్తత

Students Union protests at minister Botsa house in Vijayanagaram
  • ఎంఆర్ కాలేజి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా
  • కాలేజి నుంచి బొత్స ఇంటివరకు ర్యాలీ
  • పోలీసులకు, విద్యార్థులకు మధ్య
శతాధిక వసంతాల చరిత్ర ఉన్న విజయనగరం మహారాజా కళాశాల (ఎంఆర్ కళాశాల)ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ నివాసాన్ని ముట్టడించారు. ఎంఆర్  కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మొదట ఎంఆర్ కాలేజి వద్ద ధర్నా నిర్వహించారు. ఆపై ర్యాలీగా మంత్రి బొత్స నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేతలతో పాటు, జిల్లా నేతలు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఆర్ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Botsa Satyanarayana
Vijayanagaram
SFI
Protest
MR College

More Telugu News