అదుపుకోల్పోయి విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ నౌక.. వీడియో ఇదిగో
- విశాఖ తెన్నేటి పార్క్ వద్ద ఒడ్డుకు భారీ నౌక
- బంగ్లాదేశ్‌కు చెందిన నౌక?
- గాలుల తాకిడి అధికంగా ఉండడంతో ఘటన
అలల తాకిడికి ఔటర్ హార్బర్లో యాంకర్ తెగి ఒడ్డుకు వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది తీరానికి సమీపంలో ఇసుకలో కూరుకుపోయింది. అందులో దాదాపు 15మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు, పోర్టు సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.