మీటర్లు బిగించే క్రమంలో రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు: సీఎం జగన్
- ఉచిత్ విద్యుత్ పథకంపై సీఎం జగన్ సమీక్ష
- రైతుల్లో అవగాహన కల్పించాలని సూచన
- నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలవుతుందని వెల్లడి
ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా ఇకపై విద్యుత్ బిల్లులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు. రైతులు అదే నగదును విద్యుత్ బిల్లుల కింద డిస్కంలకు చెల్లిస్తారని వివరించారు. ఈ విధానం ద్వారా వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ ను అందించే వీలుందని అన్నారు. మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకే పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.