హైదరాబాద్ వాతావరణానికి కంగనా ఫిదా
- షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన కంగనా
- తలైవి చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్
- హైదరాబాద్ ఎంతో ఆహ్లాదకరం అంటూ ట్వీట్
హైదరాబాద్ ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉందని కితాబిచ్చారు. హిమాలయాల్లో కరిగిన శరద్ ఋతువు ఇక్కడ శీతాకాలంగా మారిందా అన్నట్టుగా ఉందని అభివర్ణించారు. ఉషా కిరణాల రాకతో హైదరాబాద్ ఆకాశం వెలిగిపోతుందని, లేత చలిగాలుల్లో ఉదయ భానుడి వెచ్చదనం కలగలసి మొత్తానికి ఓ మత్తులోకి తీసుకెళుతుందని కంగనా కవితాత్మకంగా ట్వీట్ చేశారు.