Corona Virus: దేశంలో 70 లక్షలు దాటిన కరోనా కేసులు

Indias COVID19 tally crosses 70lakh mark
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 70 లక్షల మార్కును దాటింది. గత 24 గంటల్లో 74,383 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,53,807 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 918 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,08,334 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 60,77,977 మంది కోలుకున్నారు. 8,67,496 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          

       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 8,68,77,242 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,78,544 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News