రేపు తీరం దాటనున్న వాయుగుండం... ఆ వెంటనే 14న మరో అల్పపీడనానికి చాన్స్!
- నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం
- ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు
- వరుస అల్పపీడనాలతో మరిన్ని వర్షాలు
దీని ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. ఆపై 14వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్న వాతావరణ శాఖ, దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.