ప్రకృతి ఒడిలో భర్తతో... ఫొటో పంచుకున్న రిచా గంగోపాధ్యాయ్
- కొంతకాలం కిందట అమెరికన్ ను పెళ్లి చేసుకున్న రిచా
- సినిమాలకు ఎప్పుడో దూరం
- అమెరికాలోనే సెటిలైన నటి
"ఓ నాస్తికవాద ఇండో-అమెరికన్ మహిళగా, వలసవాదిగా... నాస్తికుడైన కాకేసియన్ అమెరికన్ సంతతికి చెందిన అమెరికా మాజీ సైనికుడ్ని పెళ్లాడాను. ఈ వివాహం చేసుకున్న సమయంలో ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. నాపై తమ అభిప్రాయాలు రుద్దేందుకు ప్రయత్నించారు. కానీ మా అనుబంధం పెళ్లి వరకు వెళ్లిందంటే అందుకు కారణం జాతి, మతం, నేపథ్యం ఏమీ చూసుకోలేదు కాబట్టి. మేం ప్రాథమిక విలువలకు కట్టుబడి ఉంటాం కాబట్టి మాది అనుకూల దాంపత్యం అని చెప్పగలను. ఎందుకంటే మేం పోరాడతాం... కానీ కలిసుండేందుకు, విడిపోయేందుకు కాదు" అంటూ తన మనసులోని భావాలను రిచా పంచుకున్నారు.