గుణశేఖర్ 'శకుంతల'గా అనుష్క?
- దర్శకుడు గుణశేఖర్ తాజా చిత్రం 'శాకుంతలం'
- అనుష్కను తీసుకోమంటూ దర్శకుడికి సందేశాలు
- అంగీకరించమంటూ అనుష్కకు రిక్వెస్టులు
ఇందులో శకుంతల పాత్రకు అనుష్కను తీసుకోవాలని గుణశేఖర్ యోచిస్తున్నాడని అంటున్నారు. మరోపక్క, ఈ పాత్రకు అనుష్క ఇప్పటికే ఆమోదం కూడా తెలిపిందని మరికొందరు అంటున్నారు.
ఇదిలావుంచితే, సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రం గురించి జోరుగా చర్చ సాగుతోంది. 'శాకుంతలం' దృశ్య కావ్యానికి అనుష్క అయితేనే సరిగ్గా సరిపోతుందంటూ దర్శకుడు గుణశేఖర్ కి అభిమానులు మెసేజెస్ పెడుతున్నారు. అలాగే, అనుష్కను కూడా దీనికి అంగీకరించమని కోరుతూ రిక్వెస్టులు చేస్తున్నారు. మరి, ఇంతకీ దర్శకుడు ఈ పాత్రకి ఎవరిని ఎంపిక చేస్తున్నాడో చూడాలి!