రెండు సినిమాలకు ఓకే చెప్పిన మలయాళ ముద్దుగుమ్మ!
- 'ప్రేమమ్'తో గుర్తింపు పొందిన అనుపమ
- ఆమె ఖాతాలో 'శతమానం భవతి' హిట్
- అనుకున్నంతగా బిజీ కాలేకపోయిన భామ
- తాజాగా 'కార్తికేయ 2', '18 పేజెస్' చిత్రాలు
ఇక గత కొంత కాలంగా తెలుగులో సినిమాలు చేస్తున్న హీరోయిన్లలో మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కూడా వుంది. 'ప్రేమమ్' చిత్రం ద్వారా గుర్తింపు పొందిన అనుపమ కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించి పేరు తెచ్చుకుంది. అయితే, అనుకున్నంతగా మాత్రం ఆమె ఇక్కడ బిజీ కాలేదు. 'శతమానం భవతి' వంటి సూపర్ హిట్ సినిమా పడినా, ఇంకా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం ఆమెకు రాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిన్నది తెలుగులో రెండు సినిమాలకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. వీటిలో 'కార్తికేయ 2' ఒకటి కాగా, మరొకటి '18 పేజెస్'. విశేషం ఏమిటంటే, ఈ రెండింటిలోనూ కూడా హీరో నిఖిల్ కావడం!