KKR: ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు... తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా

KKR won the toss against KXIP
షార్ట్స్‌లో చూడండి
కరోనా సమయంలో క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నేడు రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. తొలుత అబుదాబిలో కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండో మ్యాచ్ కు దుబాయ్ వేదికగా నిలుస్తోంది.

ఇక, కోల్ కతా, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ విషయానికొస్తే... ఈ పోరులో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపింది. రాహుల్ త్రిపాఠి, శుభ్ మాన్ గిల్,ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్ లతో కోల్ కతా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ లో శివం మావి స్థానంలో ప్రసిధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులోనూ ఓ మార్పు జరిగింది. పేసర్ షెల్డన్ కాట్రెల్ స్థానంలో ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చాడు. ఆసీస్ డాషింగ్ బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇప్పటివరకు తన స్థాయికి తగిన ఇన్నింగ్స్ ఆడకపోవడం పంజాబ్ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
Go Back to Shorts
KKR
Toss
KXIP
IPL 2020
Abudabi
Dubai
UAE

More Telugu News