IYR Krishna Rao: ఇప్పటికైనా సమయం మించిపోలేదు ముందు ఈ పని చేయండి: జగన్‌కు ఐవైఆర్ సూచన

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'నిరసన తెలుపుతూ ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చిన ఆర్థిక సహాయాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ.. ఈ రోజు వైఎస్ జగన్ గారు గాని తీసుకుని ఉండాల్సింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ముందు ప్యాకేజీ తీసుకొని హోదా కోసం పోరాటం కొనసాగించవచ్చు. లేకపోతే రెంటికీ చెడ్డ రేవడిల మయే ప్రమాదం ఉంది అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలను ఆయన పోస్ట్ చేశారు.  

ఏపీ డిమాండ్ చస్తోన్న పెండింగ్ రెవెన్యూ లోటు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు సంబంధించినదని, ఆ సంఘం గడువు తీరిపోయిందని నిర్మలా సీతారామన్ నిన్న తెలిపినట్లు అందులో ఉంది. అంతేగాక‌, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇచ్చి ఏడాది గ‌డిచిపోయింద‌ని, దాని అమ‌లు కూడా ప్రారంభ‌మైంద‌ని ఆమె పేర్కొన్నారు.
IYR Krishna Rao
Telugudesam
YSRCP
Andhra Pradesh
Special Category Status

More Telugu News