వైసీపీ ఎమ్మెల్యే భూమనకు మళ్లీ సోకిన కరోనా.. నేడు మరోమారు పరీక్షలు

  • ఆగస్టులో కరోనా బారినపడి కోలుకున్న ఎమ్మెల్యే
  • నిన్న నిర్వహించిన పరీక్షల్లో మరోమారు పాజిటివ్
  • నేటి ఫలితం అనంతరం చికిత్స
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి మరోమారు కరోనా సోకింది. ఆగస్టులో తొలిసారి కరోనా బారినపడిన ఆయన రుయా ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబులో నిన్న నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోమారు పరీక్షలు చేయించుకుంటానని, ఫలితాన్ని బట్టి తదుపరి వైద్య సేవలు పొందుతానని ఎమ్మెల్యే తెలిపారు.

bhumana karunakar reddy
Corona Virus
Tirupati

More Telugu News