రసాయనశాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించిన నోబెల్ ప్రైజ్
- దౌడ్నా, చార్పెంటీర్ లకు కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్
- జన్యుకత్తెర విధానానికి రూపకల్పన చేసిన శాస్త్రవేత్తలు
- అత్యంత కచ్చితత్వంతో జన్యుమార్పిడికి అవకాశం
ఓ జీవి డీఎన్ఏ జన్యుపటాన్ని సవరించడమే కాకుండా, దాన్ని నియంత్రించేందుకు జీనోమ్ ఎడిటింగ్ విధానాన్ని ఆవిష్కరించారు. ఒక విధంగా చెప్పాలంటే ఓ జీవి డీఎన్ఏను మార్చడం ఇకపై ఎంతో సులువు. అది జంతువైనా, మొక్క అయినా సరే... అత్యంత కచ్చితత్వంతో తాము కోరుకున్న జన్యువును ఎంతమేర మార్చవచ్చో అంతమేర మాత్రమే మార్పులు చేసుకోవడం సాధ్యమవుతుంది.