చిరంజీవి తదుపరి సినిమా.. బ్యాక్ డ్రాప్ అదేనా?
- కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో గతంలో 'చూడాలని ఉంది'
- మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్
- కోల్ కతా నగరానికి, కథకు మంచి సంబంధం
- 'ఆచార్య' తర్వాత 'లూసిఫర్'తో పాటు సెట్స్ కి
అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన 'వేదాళం' చిత్రాన్ని చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. మెహర్ రమేశ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రకథ కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. కోల్ కతా నగరానికి, చిత్రకథకు మధ్య మంచి సంబంధం వుంటుందట. మరి, షూటింగులో కొంత భాగం అక్కడ చేస్తారో లేదో ఇంకా వెల్లడి కాలేదు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రలో కథానాయిక సాయిపల్లవి నటిస్తుందని అంటున్నారు. మణిశర్మ తనయుడు సాగర్ దీనికి సంగీతం సమకూరుస్తాడని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న 'ఆచార్య' చిత్రం పూర్తయ్యాక, ఈ 'వేదాళం' రీమేక్ తో పాటు, 'లూసిఫర్' రీమేక్ కూడా సెట్స్ కి వెళుతుంది.