Corona Virus: దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్‌..!

India reports a spike of 61267 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో గత 24 గంటల్లో 61,267 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,85,083 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 884 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,03,569 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 56,62,491 మంది కోలుకున్నారు. 9,19,023 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          
          
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 8,10,71,797 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,89,403 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News