Varla Ramaiah: సజ్జల గారూ... దాడులు చేస్తుంటే డీజీపీకి కాకుండా సినిమా డైరెక్టర్ కి చంద్రబాబు లేఖ రాయాలా?: వర్ల 

Varla Ramaiah satires on Sajjala Ramakrishna Reddy who questions Chandrababu for writing DGP
  • చంద్రబాబు డీజీపీకి లేఖ రాయడాన్ని ప్రశ్నించిన సజ్జల
  • భలే మేధావి అంటూ వర్ల వ్యంగ్యం
  • సలహా ఇవ్వాల్సిన మీరు పట్టించుకోవడంలేదంటూ వ్యాఖ్యలు
అధినేత చంద్రబాబు పదేపదే డీజీపీకే ఎందుకు లేఖ రాస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించడం పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. సజ్జల గారూ, భలే మేధావులు మీరు! అంటూ ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ప్రశ్నించే నోరు నొక్కుతూ, దాడులకు పాల్పడుతుంటే డీజీపీకి కాకుండా సినిమా డైరెక్టర్ కు చంద్రబాబు లేఖ రాయాలా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. పోలీస్ బాస్ ను పలు దఫాలు హైకోర్టుకు పిలిచి హెచ్చరించినా శాంతిభద్రతలు మెరుగుపడలేదని వర్ల రామయ్య విమర్శించారు. సలహా ఇవ్వవలసిన మీరు పట్టించుకోరు... ఖర్మ! అంటూ ట్వీట్ చేశారు.
Varla Ramaiah
Sajjala Ramakrishna Reddy
Chandrababu
DGP
Letters

More Telugu News