Nagarjuna: 'బిగ్ బాస్'కు దూరం కానున్న నాగార్జున?

Nagarjuna to stay away from Bigg Boss for 20 days
  • 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటిస్తున్న నాగార్జున
  • థాయ్ లాండ్ లో షూటింగ్ కు వెళ్తున్న వైనం
  • 20 రోజుల పాటు షోకు దూరమయ్యే అవకాశం
సినీ నటుడు నాగార్జున వరుసగా రెండో సీజన్ లో కూడా బిగ్ బాస్ షోలో అదరగొడుతున్నారు. ఈ సీజన్ లో టాప్ సెలబ్రిటీలు లేకపోయినా తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ, ప్రేక్షకులను మెప్పిస్తూ, షోను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. మరోవైపు నాగ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల పాటు బిగ్ బాస్ షోకు ఆయన దూరం కానున్నారనేదే ఆ వార్త.

సోలోమన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే థాయ్ లాండ్ లో కీలకమైన షెడ్యూల్ ని షూట్ చేయనున్నారు. కనీసం 20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ నేపథ్యంలో నాగార్జున బిగ్ బాస్ కు దూరం కానున్నారు. అంటే కనీసం 6 ఎపిసోడ్లలో ఆయన కనిపించకపోయే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో రమ్యకృష్ణ లేదా మరెవరితోనైనా షోను రన్ చేయించాలనే ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారు. నాగార్జున దూరమైతే షో టీఆర్పీపై ప్రభావం పడే అవకాశం ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది.
Nagarjuna
Tollywood
Bigg Boss

More Telugu News