Kajal Aggarwal: గౌతమ్ కిచ్లుని పెళ్లాడబోతున్న కాజల్ అగర్వాల్?

Kajal Aggarwal to marry Mumbai businessman
  • ముంబై వ్యాపారవేత్తను పెళ్లాడనున్న కాజల్
  • ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్టు సమాచారం
  • ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తున్న కాజల్
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లిపీటలు ఎక్కబోతోందనే ప్రచారం ఊపందుకుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు చెపుతున్నారు. కొంత కాలం క్రితం వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయని సమాచారం.

మరోవైపు వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ వార్తలను ఖండించిన కాజల్... ఇప్పుడు స్పందించకుండా, సైలెంట్ గా ఉంటోంది. దీంతో, త్వరలోనే పెళ్లిబాజాలు మోగబోతున్నాయని అందరూ భావిస్తున్నారు.

మరోవైపు కాజల్ ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. వీటిలో చిరంజీవి చిత్రం 'ఆచార్య', కమల్ హాసన్ సినిమా 'భారతీయుడు2', మంచు విష్ణు చిత్రం 'మోసగాళ్లు'తో పాటు జాన్ అబ్రహం సినిమా కూడా ఉంది.
Kajal Aggarwal
Tollywood
Bollywood
Marriage

More Telugu News