శ్రీశైలం తవ్వకాల్లో మరోసారి బయటపడిన బంగారు నాణేలు
- ఘంటామఠంలో బంగారు, వెండి నాణేలు లభ్యం
- బంగారంతో కూడిన పెట్టెను గుర్తించిన వైనం
- 2017లోనూ ఇదే స్థలంలో బంగారం గుర్తింపు
శ్రీశైలంలో బంగారు నాణేల కలకలం రేగడంతో ఆలయ ఈవో కేఎస్ రామారావు, తహసీల్దార్ రాజేంద్ర సింగ్, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆ నాణేలను అధికారులను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీశైలంలో నిధులు బయల్పడడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనూ సరిగ్గా ఘంటామఠం వద్దే బంగారు, వెండి వస్తువులు లభించాయి. 18 బంగారు నాణేలు, 3 బంగారు కడియాలు, 3 ఉంగరాలు, చిన్నపాటి బంగారు వస్తువులు, 147 వెండి నాణేలు, ఒక వెండి బేసిన్, 2 వెండి గిన్నెలు లభ్యమయ్యాయి.