టీడీపీ నేత పట్టాభి కారుపై దాడి పట్ల దేవినేని ఉమ, బోండా ఉమ ఆగ్రహం
- ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను పట్టాభి ప్రశ్నిస్తున్నారు
- సమాధానం చెప్పలేక కారు ధ్వంసం
- ఇది ప్రభుత్వ పిరికిపంద చర్య
- దాడులు జరుపుతూ వైసీపీ భయపెట్టాలని ప్రయత్నిస్తోంది
కారు ధ్వంసం ఘటనపై టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు స్పందిస్తూ.. ఈ ఘటన చాలా దుర్మార్గమని అన్నారు. విజయవాడలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని ఆయన చెప్పారు. ఇలాంటి దాడులు జరుపుతూ వైసీపీ భయపెట్టాలని ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. ఇటువంటి ఘటనల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.