Bollywood: బాలీవుడ్ యువ‌ నటి మిష్టీ ముఖ‌ర్జీ మృతి

Actress Mishti Mukherjee dies of kidney failure
  • కిడ్నీ వ్యాధితో కన్నుమూత
  • 2012లో లైఫ్ కి తో ల‌గ్ గ‌యి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం
  • అనేక ఐటెం సాంగ్స్‌లో డ్యాన్స్‌
  • ఆమె పలు బెంగాలీ సినిమాల్లోనూ నటన
బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మిష్టీ ముఖ‌ర్జీ(27) కిడ్నీ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. కొంత కాలంగా ఆమెకు కిడ్నీ సంబంధిత అనారోగ్య స‌మ‌స్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె బెంగళూరులోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2012లో లైఫ్ కి తో ల‌గ్ గ‌యి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు.

అనంతరం అనేక ఐటెం సాంగ్స్‌లో నటించారు. ఆమె పలు బెంగాలీ సినిమాల్లోనూ నటించారు. 2014లో ఆమెపై సెక్స్ రాకెట్, పోర్నోగ్రఫీ కంటెంట్‌ వంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెతో పాటు ఆమె తండ్రి, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తన తల్లిండ్రులు, సోదరుడి వద్దే ఉంటున్నారు.
Bollywood
bangalore
Karnataka

More Telugu News