Sudarsan Pattnaik: ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం

Sudarsan Pattnaik wishes speedy recovery for Donald Trump and Melania with sand art
  • ట్రంప్‌తో పాటు ఆయన భార్యకు కరోనా
  • ట్రంప్‌కు ఆసుపత్రిలో చికిత్స
  • గెట్‌ వెల్‌ సూన్ అంటూ సుదర్శన్ సైకత శిల్పం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాల్టర్ రీడ్ ఆర్మీ ఆసుపత్రిలో ట్రంప్‌కు చికిత్స అందుతోంది. డొనాల్డ్ ట్రంప్, మెలానియా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ  ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బీచ్‌ వద్ద సైకత శిల్పాన్ని రూపొందించారు.

అమెరికా జాతీయ జెండా, డొనాల్డ్ ట్రంప్, మెలానియా సైకత శిల్పాలను ఆయన రూపొందించారు.  ఆ సైకత శిల్పానికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ సైకత శిల్పంపై రాశారు. వారిద్దరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సుదర్శన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఆసుపత్రిలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే రెండు డోసుల రెమ్‌డెసివిర్‌ను ఇచ్చారు.
Sudarsan Pattnaik
Donald Trump
USA

More Telugu News