pattabhi: టీడీపీ నేత పట్టాభి కారును ధ్వంసం చేసిన దుండగులు.. చంద్రబాబు, లోకేశ్ ఆగ్రహం

pattabi car vandaises in ap
  • గత అర్ధరాత్రి ఘటన
  • వైసీపీపై పట్టాభి ఆగ్రహం
  • పట్టాభికి చంద్రబాబు, లోకేశ్ ఫోన్
టీడీపీ నేత పట్టాభిరామ్ కారుపై కొందరు దుండగులు దాడి చేసి, దాని అద్దాలను పగులకొట్టారు. ఆ కారు తన నివాసం బయట పార్క్‌ చేసి ఉండగా గత అర్ధరాత్రి దుండగులు దాడి చేశారని, తాను వైసీపీ తీరుపై పోరాడుతున్నందుకే ఇలా చేశారని పట్టాభి తెలిపారు. తాను ఉంటోన్న ఇంటి పక్కనే హైకోర్టు జడ్జి ఇల్లూ ఉందని, అక్కడే పోలీస్ పికెట్ ఉన్నప్పటికీ తన కారు అద్దాలను ధ్వంసం చేశారని ఆయన చెప్పారు.
        
       
ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్.. పట్టాభికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. పట్టాభి ధైర్యంగా ఉండాలని వారు అన్నారు. నిన్న సబ్బం హరి ఇంటిని పగులకొట్టారని, అనంతరం పట్టాభి కారును కూడా ధ్వంసం చేశారని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో  జంగిల్ రాజ్ కొనసాగుతోందని మండిపడ్డారు. కాగా, ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
pattabhi
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News