Ayyanna Patrudu: జగన్ చెత్త పాలనను ప్రశ్నించినందుకే ఇంటిని కూల్చేస్తున్నారు: అయ్యన్నపాత్రుడు

YS Jagna is a psycho says Ayyanna Patrudu
  • విధ్వంసం తప్ప జగన్ డిక్షనరీలో మరేమీ లేదు
  • అమరావతిలో ప్రారంభమైన విధ్వంసం విశాఖకు చేరింది
  • జగన్ రెడ్డి ఒక సైకో
మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను విశాఖ జీవీఎంసీ అధికారులు కూల్చివేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్న సబ్బం హరిని వైసీపీ టార్గెట్ చేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఈ అంశంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు.

విధ్వంసం తప్ప జగన్ గారి డిక్షనరీలో ఇంకేమీ లేదని అయ్యన్న అన్నారు. అమరావతిలో ప్రారంభమైన విధ్వంసం విశాఖకు చేరుకుందని దుయ్యబట్టారు. జగన్ చెత్త పాలనను ప్రశ్నించినందుకే సబ్బం హరిగారి ఇంటిని కూల్చివేస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో మచ్చ లేని వ్యక్తిగా ఉన్న సబ్బం హరిపై కక్ష సాధింపా? అని మండిపడ్డారు. 'కూల్చడం తప్ప మరేమీ తెలియని సైకో జగన్ రెడ్డి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సబ్బం హరి ఇంటిని కూల్చుతున్న వీడియోను షేర్ చేశారు.
Ayyanna Patrudu
Telugudesam
Sabbam Hari
Jagan
YSRCP

More Telugu News