Mahesh Babu: మెలితిరిగిన మీసంతో మహేశ్ బాబు.. 'డబుల్‌ ధమాకా' వీడియో, ఫొటోలు వైరల్

Latest pics of Mahesh babu from an advertisement
షార్ట్స్‌లో చూడండి
కరోనా వైరస్ విజృంభణ వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం మళ్లీ కెమెరా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్ బాబు కొత్త లుక్‌లో ఉన్న ఫొటోలు ఇటీవల విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా, ఆ యాడ్‌ విడుదలైంది.
                 
ఈ ప్రకటనలో మహేశ్ బాబు లుక్స్‌ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఓ లుక్‌లో చాలా యంగ్‌ గా కనపడుతుండగా, మరో లుక్‌లో మెలితిరిగిన మీసంతో ఉన్నాడు. మహేశ్ బాబును ఎన్నడూ లేని విధంగా ఇలాంటి మీసంతో కనపడుతుండడం ఆయన అభిమానులను అలరిస్తోంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ కోసం మహేశ్ ఈ యాడ్‌లో నటించాడు. డబుల్ ధమాకా ఆఫర్‌ నేపథ్యంలో ఇలా మహేశ్ డబుల్‌ యాక్షన్‌లో కనపడి ప్రేక్షకులకు డబుల్‌ ధమాకా మజా అందించాడు.
            
Go Back to Shorts
Mahesh Babu
Tollywood
Viral Videos

More Telugu News