చిన్నారులపై లైంగిక చర్యలు చేయమని ప్రోత్సహిస్తూ వీడియోలు.. నిందితుడికి 600 ఏళ్ల జైలు శిక్ష

  • అమెరికాలో ఘటన
  • 12 ఏళ్ల లోపు చిన్నారిపైనా అత్యాచారం
  • 2014-2019 మధ్య అకృత్యాలు
అమెరికాలో ఓ కామాంధుడికి కోర్టు 600 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. చిన్నారులపై లైంగిక చర్యలను ప్రోత్సహించడమే కాక, ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాటన్‌డేల్‌కు చెందిన నిందితుడు టేలర్ మిల్లర్ (32)పై మోపిన అభియోగాలను నిజమని తేల్చిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి స్కాట్ కూగ్లర్ ఈ మేరకు తీర్పు చెప్పారు.

2014-2019 మధ్య నిందితుడు ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రతినిధి జానీ షార్ప్ జూనియర్ తెలిపారు. బాధితుల్లో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని న్యాయవాదులు పేర్కొన్నారు. నిందితుడి గదిని గాలించినప్పుడు 102 అశ్లీల చిత్రాల వీడియోలు దొరికినట్టు చెప్పారు. అంతేకాదు, 12 ఏళ్ల లోపున్న చిన్నారిపైనా అత్యాచారం చేసినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, 2019లో మిల్లర్ తన నేరాన్ని అంగీకరించాడు. తాజాగా, శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.

America
Objectionable videos
court
600 years punishment

More Telugu News