సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

*  కాఫీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది కథానాయిక కీర్తి సురేశ్. "ఓ కప్పు కాఫీ తాగితే నాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అందుకే, ఎలాంటి పరిస్థితులలోనైనా ఓ కప్పు కాఫీ తాగడానికి ప్రయత్నిస్తుంటా' అని చెప్పింది కీర్తి.
*  నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'చెక్' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ ఈ నెలాఖరు నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వరియర్ కథానాయికలుగా నటిస్తున్నారు.
*  ఆమధ్య విడుదలైన 'పలాస 1978' చిత్రం ద్వారా పేరుతెచ్చుకున్న దర్శకుడు కరుణకుమార్ తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సుధీర్ బాబు కథానాయకుడుగా నటిస్తాడు. కరుణకుమార్ చెప్పిన గ్రామీణ వాతావరణంలో సాగే కథ నచ్చడంతో సుధీర్ బాబు వెంటనే ఓకే చెప్పేశాడట.

Keerti Suresh
Nithin
Rakul Preet Singh
Sudhir babu

More Telugu News