తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌

spike of 2009 new cases in telangana
  • కొత్తగా 2,009 కేసులు 
  • మొత్తం కేసులు 1,95,609
  • 1,65,844 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,145
తెలంగాణ‌లో కరోనా కేసుల తాజా వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,009 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,437 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,609 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,65,844 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,145 కు చేరింది. ప్రస్తుతం 28,620 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 293, రంగారెడ్డి జిల్లాలో 171 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..  
     
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News