పోలీసులతో తోపులాటలో కిందపడిపోయిన రాహుల్ గాంధీ... పరామర్శించిన ప్రియాంక
- హత్రాస్ బయల్దేరిన రాహుల్ గాంధీ
- గ్రేటర్ నోయిడా వద్ద అడ్డుకున్న పోలీసులు
- కాలినడకన వెళ్లేందుకు రాహుల్ ప్రయత్నం
హత్రాస్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, అక్కడికి వెళ్లడం మానుకోవాలని పోలీసులు రాహుల్ గాంధీకి సూచించారు. అయితే ఆయన ముందుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఓ దశలో పోలీసులతో తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఇతర కాంగ్రెస్ నేతలు ఆయన పైకి లేచేందుకు సాయపడ్డారు. కిందపడిన అన్నను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. తనను కూడా పోలీసులు నెట్టివేశారంటూ ఆమె ఆరోపించారు.
