'అల్లు స్టూడియోస్' ప్రారంభించిన బన్నీ కుటుంబ సభ్యులు
- ఇవాళ అల్లు రామలింగయ్య జయంతి
- నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు
- సినిమా, టీవీ షూటింగులకు ఉపయోగపడేలా భారీ స్టూడియో నిర్మాణం
ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. స్టూడియో ప్రారంభించడంపై అల్లు అరవింద్ త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది.