బాలకృష్ణ తాజా చిత్రంలో సోనూసూద్!
- నిజజీవిత హీరో అనిపించుకున్న సోనూ
- 'అల్లుడు అదుర్స్' సినిమాలో కీలక పాత్ర
- బోయపాటి, బాలయ్య సినిమాలో విలన్
- త్వరలో షూటింగ్ మొదలయ్యే అవకాశం
ఈ క్రమంలో బాలకృష్ణ నటించే చిత్రంలో విలన్ పాత్ర పోషించే అవకాశం ఇప్పుడు సోనూ సూద్ కు వచ్చినట్టు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో సోనూను విలన్ పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రం తదుపరి షూటింగ్ త్వరలో హైదరాబాదులో మొదలవుతుంది.
మరోపక్క, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న 'అల్లుడు అదుర్స్' చిత్రంలో కూడా సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఆయన హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో వున్నాడు.