పేద దేశాలకు 10 కోట్ల డోస్ ల వ్యాక్సిన్ సరఫరా: సీరమ్ ఇనిస్టిట్యూట్
- డబ్ల్యూహెచ్ఓ నుంచి అనుమతి రాగానే వ్యాక్సిన్ సరఫరా
- వచ్చే సంవత్సరం తొలి ఆరునెలల్లోనే పంపిణీ
- అదనంగా రూ. 1,125 కోట్లు అందించనున్న గేట్స్ ఫౌండేషన్
2021 తొలి ఆరు నెలల్లోనే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. తాము ఇప్పటికే గవి, బిల్ అండ్ మిలిందా గేట్స్ తో రూ.1,125 కోట్లతో 10 కోట్ల డోస్ ల తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ ఫౌండేషన్ అదనంగా మరో రూ. 1,125 కోట్లను అందించనుందని ఆయన అన్నారు. ఆ నిధులతో మరో 10 కోట్ల డోస్ లను అందిస్తామని తెలిపారు.