సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సివిల్స్ విజేతలు
- ఇటీవల యూపీఎస్సీ ఫలితాలు
- ఏపీ నుంచి పదిమంది విజేతలు
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ
ఈ సందర్భంగా వారిని సీఎం మనస్ఫూర్తిగా అభినందించారు. ఏ రాష్ట్ర క్యాడర్ లో పనిచేసినా ఏపీకి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ఉద్బోధించారు. వృత్తిలో రాణిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సివిల్స్ విజేతలతో ముఖ్యమంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.