దుబాయ్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న పాలకొల్లు మహిళ అరెస్ట్!
- మహిళలను నిర్బంధిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న జ్యోతి
- లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసులు
- బెంగళూరు ఎయిర్ పోర్టులో అరెస్ట్
ఇదే సమయంలో ఆకుమర్తి జ్యోతిపై మొగల్తూరు, కలిదిండి, టి.నరసాపురం, కర్నూలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో, దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న జ్యోతిని ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో జ్యోతిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు నరసాపురం పోలీస్ స్టేషన్ కు తరలించి, విచారిస్తున్నారు. ఆకుమర్తి జ్యోతిది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కావడం గమనార్హం. పోలీసు విచారణలో సెక్స్ రాకెట్ కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.