దృష్టి మరల్చడానికి చంద్రబాబు లేని ఎజెండాను ఎత్తుకున్నాడు: విజయసాయిరెడ్డి

  • భూకుంభకోణం నుంచి పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు
  • విజయవాడలోనే డజన్ల కొద్ది ఆలయాలను కూలగొట్టాడు
  • బీజేపీ కొన్ని వర్గాలకు వ్యతిరేకమంటూ ఎన్నికల ముందు చెప్పారు
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా దేవాలయాలపై జరుగుతోన్న దాడులపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తోన్న వ్యాఖ్యల పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

'భూకుంభకోణం నుంచి దృష్టి మరల్చడానికి లేని ఎజెండాను ఎత్తుకున్నాడు చంద్రబాబు. విజయవాడలోనే డజన్ల కొద్ది ఆలయాలను కూలగొట్టాడు. బీజేపీ కొన్ని వర్గాలకు వ్యతిరేకమంటూ ఎన్నికల ముందు నానా హంగామా చేశాడు. కశ్మీర్ నుంచి కూడా నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.

Vijay Sai Reddy
YSRCP
Chandrababu

More Telugu News