Corona Virus: తెలంగాణలో కరోనా విజృంభణ... అప్‌డేట్స్‌

spike of 2239 new cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లో కరోనా కేసులు ప్రతిరోజు 2,000కు పైగా నమోదవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,239 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,281మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,866కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,52,441 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,091కు చేరింది. ప్రస్తుతం 30,334 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 316, రంగారెడ్డి జిల్లాలో 192 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు.. 

Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News