డ్రగ్స్ కేసులో దీపిక, శ్రద్ధలను పట్టించిన చాటింగ్ ఇదే!
- పలువురు హీరోయిన్లకు ఎన్సీబీ నోటీసులు
- వరుసగా విచారించనున్న అధికారులు
- ఎన్సీబీ వద్ద హీరోయిన్లకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు
- కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు
ఈ క్రమంలో వీరందరికీ వ్యతిరేకంగా ఎన్సీబీ వద్ద ఏ విధమైన సాక్ష్యాలు ఉన్నాయి? వాటిని ఎలా సేకరించారు? తదితర విషయాలపై అధికారులు, అనధికారికంగానే అయినా, మీడియాకు ఉప్పందించారు. వీరందరి వాట్సాప్ చాటింగే వీరిని పట్టించిందని సమాచారం. సుశాంత్ కు టాలెంట్ మేనేజర్ గా ఉండి, ఆపై దీపికా పదుకొణే తరఫున కూడా పనిచేసిన జయా సాహా, మొత్తం కేసులో కీలకంగా మారారు. అధికారుల విచారణలో ఆమె పలువురి పేర్లను వెల్లడించగా, వారి చాటింగ్స్ లో డ్రగ్స్ ప్రస్తావన ఉన్నట్టు అధికారులు గుర్తించిన తరువాతనే నోటీసులు పంపించారు.
ఇక ఈ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు మీడియాకూ చిక్కాయి. తన బిజినెస్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్ తో మాట్లాడుతూ దీపిక డ్రగ్స్ గురించి ప్రస్తావించింది. ఈ చాటింగ్, 2017, అక్టోబర్ 28న రాత్రి 10 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. విచారణ అధికారుల సమాచారం ప్రకారం...
దీపిక: ఓకే... నీ దగ్గర మాల్ ఉందా?
కరిష్మా: ఇంటి దగ్గర ఉంది. నేను ఇప్పుడు బాంద్రాలో ఉన్నాను. నీకు కావాలంటే అమిత్ ను అడుగుతాను.
దీపిక: సరే అడుగు.
అంటూ చాట్ చేస్తున్న సమాచారం నార్కోటిక్స్ అధికారులకు లభించింది. ఆపై దీపిక 'ప్లీజ్....' అంటూ మెసేజ్ చేసిందని, కరిష్మా స్పందిస్తూ, అమిత్ తెచ్చిస్తాడని చెప్పగా, తప్పకుండా తెస్తాడా? అని దీపిక అడిగినట్టు కూడా తెలుస్తోంది.
ఆ తరువాత ఇప్పటివరకూ అతను రాలేదని దీపిక, వస్తున్నాడన్న కరిష్మా, ఏ సమయానికి వాటిని తీసుకునేందుకు వస్తావని కూడా దీపికను ప్రశ్నించింది. తాను 11.30 నుంచి 12 గంటల మధ్య వస్తానని, అతను ఎప్పటికి వస్తాడని దీపిక ప్రశ్నించగా, 11.30కే మాల్ అందుతుందని, 12 గంటలకు మరొకరికి ఇవ్వాల్సి వుందని కరిష్మా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరో చాట్ శ్రద్ధా కపూర్, జయా సాహా మధ్య సాగగా... దాన్ని కూడా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సంపాదించారు. ఇదే సమయంలో సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ల ప్రమేయంపైనా ఆధారాలు లభించాయని, అందుకే నోటీసులు ఇచ్చామని, వీరందరికీ రియాతో సంబంధాలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు.