రిమ్స్‌లో లాలూను కలిసిన ఝార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా
- రిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలు
- వైద్యుల కారులో వెళ్లి లాలూను కలిసిన మంత్రి
- రాజకీయ చర్చలు నడుస్తున్నాయంటూ ఊహాగానాలు
లాలు ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు తాను వైద్యుల కారులోనే ఆసుపత్రికి వెళ్లినట్టు చెప్పారు. లాలూను బన్నాగుప్తా కలుసుకోవడం ఇది రెండోసారి కావడంతో వీరి మధ్య రాజకీయపరమైన చర్చలు నడుస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా, అంతకుముందు లాలుకు చికిత్స అందిస్తున్న వైద్యులను అభినందించిన మంత్రి వారిని సన్మానించారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్యం కారణంగా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.