50 డాలర్లకే స్మార్ట్ ఫోన్... భారత మార్కెట్లో ఆధిపత్యం కోసం ముఖేశ్ అంబానీ ప్రణాళికలు
- జియోతో సంచలనం సృష్టించిన ముఖేశ్ అంబానీ
- స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై ఆధిపత్యం కోసం ప్రణాళికలు
- చవక ఫోన్ కోసం తయారీదారులతో చర్చలు
ఇందుకోసం ఆయన భారత్ లోని మొబైల్ ఫోన్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారు. అత్యంత చవకగా రూ.4 వేలకే స్మార్ట్ ఫోన్ అందించాలన్నది ముఖేశ్ వ్యూహం. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్ తో మార్కెట్లో షియోమీకి సవాల్ విసరాలని భావిస్తున్నారు. అంతేకాదు, వచ్చే రెండేళ్లలో 200 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది.
ముఖేశ్ ఆశిస్తున్నట్టుగా ఈ ఫోన్ రూ.4 వేలకే అందుబాటులోకి వస్తే మాత్రం కచ్చితంగా అది మార్కెట్ ను చేజిక్కించుకునే ఆయుధం అవుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.