సీనియర్ సినీ నటి సీత కన్నుమూత
- కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీత
- 250కిపైగా సినిమాలు, 2 వేల వరకు నాటక ప్రదర్శనలు
- 1956లో నటుడు నాగభూషణంతో వివాహం
2002లో చివరిసారి ‘నేనేరా పోలీస్’ సినిమాలో కనిపించారు. సుమారు 250 సినిమాల్లో నటించిన సీత.. 2 వేల వరకు నాటక ప్రదర్శనలు ఇచ్చారు. రుతురాగాలు వంటి బహుళ ప్రేక్షకాదరణ పొందిన సీరియల్లోనూ నటించారు. రక్తకన్నీరు నాటకం సమయంలో ప్రముఖ నటుడు నాగభూషణంతో అయిన పరిచయం పెళ్లికి దారితీసింది. 1956లో ఆయనను వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె భువనేశ్వరి, కుమారుడు సురేందర్ ఉన్నారు.