మంత్రి కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సుమేధ తల్లిదండ్రులు
- నాలాలో పడి మృతిచెందిన చిన్నారి సుమేధ
- నేరేడ్ మెట్ పోలీసులను ఆశ్రయించిన సుమేధ తల్లిదండ్రులు
- 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి
ఈ నేపథ్యంలో, సుమేధ తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్ పై నేరేడ్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ.. కేటీఆర్ తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని వారు పోలీసులను కోరారు. తమ కుమార్తె సుమేధ మృతికి కారణమైన అందరిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.