వ్యవసాయ బిల్లు అంత గొప్పదైతే ఒక్క రైతు కూడా ఎందుకు సంబరాలు చేసుకోవట్లేదు?: కేటీఆర్
- వ్యవసాయ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- వ్యతిరేకించిన టీఆర్ఎస్ ఎంపీలు
- ఎన్డీయే మిత్ర పక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయన్న కేటీఆర్
కానీ, కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లు 2020 నిజంగా అంత గొప్పదే అయితే ఒక్క రైతు కూడా ఎందుకు సంబరాలు చేసుకోవట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయని నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేంద్రం నిన్న నూతన వ్యవసాయ చట్టం బిల్లును రాజ్యసభలో చర్చకు తీసుకురాగా, టీఆర్ఎస్ ఎంపీలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ ఈ బిల్లుకు పెద్దల సభ ఆమోదం పలికింది.