KTR: తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. తెలంగాణ బీజేపీ ఎంపీలపై మండిపడ్డ తెలంగాణ మంత్రి కేటీఆర్

ktr slams bandi sanjay
  • కొవిడ్‌-19పై పోరుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల
  • రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు వచ్చాయని బీజీపే ఎంపీలు అంటున్నారు
  • కానీ, తెలంగాణకు రూ.290 కోట్లే విడుదల
బీజేపీ తెలంగాణ ఎంపీలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్ల నిధులిచ్చిందని, అయితే సీఎం కేసీఆర్‌ వాటిని దారి మళ్లించారని బండి సంజయ్‌ చేసిన ఆరోపణలకు సంబంధించిన వార్తను కేటీఆర్‌ పోస్టు చేసి, ఆయన ఆరోపణలను తిప్పికొట్టారు.
 
'కొవిడ్‌-19పై పోరుకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు విడుదల చేసింది తెలంగాణ బీజేపీ ఎంపీలు అంటున్నారు. కానీ, ఓ ప్రశ్నకు సమాధానంగా ఎన్డీఏ ప్రభుత్వం వివరాలు తెలుపుతూ తెలంగాణకు రూ.290 కోట్లు విడుదల చేశామని తెలిపింది' అని కేటీఆర్ చెప్పారు. నిధుల విడుదల విషయాన్ని వక్రీకరిస్తూ ఇలా సిగ్గులేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ నేతలపై ఆయన మండిపడ్డారు. నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు.
KTR
Bandi Sanjay
Corona Virus
COVID-19

More Telugu News