Naga Shourya: ఐదు రోజులుగా పచ్చి మంచి నీళ్లు కూడా తాగని యంగ్ హీరో!

Naga Shourya doesnt drink even water for the last five days
  • తాజా చిత్రంలో విలుకాడిగా నటిస్తున్న నాగశౌర్య 
  • ఎయిట్ ప్యాక్ బాడీ షేప్ లో కనిపించనున్న వైనం
  • కనీసం లాలాజలాన్ని కూడా మింగడం లేదట!
  • ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్ 
నేటి యంగ్ హీరోలలో చాలా కసి కనపడుతుంటుంది. డిఫరెంట్ పాత్రలు చేయాలని ఆశపడుతుంటారు. అందుకోసం ఎంత కష్టాన్నైనా పడడానికి సిద్ధంగా వుంటారు. ముఖ్యంగా క్యారెక్టర్ని బట్టి సిక్స్ ప్యాక్ వంటి బాడీ షేప్ తెచ్చుకోవడానికి వాళ్లు పడే శ్రమ అంతాఇంతా కాదు. ఎన్నో వర్కౌట్స్ తో పాటు కఠినమైన డైట్ కూడా ఫాలో అవుతూవుంటారు. అలాగే యంగ్ హీరో నాగ శౌర్య కూడా తన తాజా చిత్రం కోసం చాలా కష్టపడుతున్నాడు.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రస్తుతం నాగ శౌర్య ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో విలుకాడిగా తను నటిస్తున్నాడు. ఈ పాత్రలో ఎయిట్ ప్యాక్ (ఎనిమిది పలకల) బాడీ షేప్ తో కనిపిస్తాడు. ఇందుకోసం ఎన్నో వర్కౌట్స్ చేస్తూ.. స్ట్రిక్ట్ డైట్ అనుసరిస్తున్నాడు.

ఈ క్రమంలో దానిని తెరపై ప్రదర్శించడం కోసం గత ఐదు రోజులుగా నాగశౌర్య పచ్చి మంచినీళ్లు కూడా తాగడం లేదట. అంతెందుకు, లాలాజలాన్ని కూడా మింగకుండా ఆ బాడీ షేప్ ప్రదర్శించడం కోసం ఎంతో రిస్క్ చేస్తూ, శ్రమిస్తున్నాడని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది.  
Naga Shourya
Ketika Sharma
Santosh
Sports Drama

More Telugu News