Vizag: పాలనా రాజధాని విశాఖకు తరలి వెళ్లినా, వెళ్లకపోయినా అక్కడ గెస్ట్ హౌస్ కడతాం: హైకోర్టులో అడ్వొకేట్ జనరల్

AP govt gives clarity to HC on Vizag guest  house
  • అమరావతి రైతుల పిటిషన్లపై హైకోర్టు విచారణ
  • గెస్ట్ హౌస్ నిర్మాణంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
  • రైతుల తరపున వాదించిన శ్యామ్ దివాన్

విశాఖలో సువిశాలమైన గెస్ట్ హౌస్ ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో పాటు అమరావతి రైతులు వేసిన పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ తన వాదనను వినిపిస్తూ.... ఏపీ పాలనా రాజధాని విశాఖకు తరలి వెళ్లినా, వెళ్లకపోయినా అక్కడ గెస్ట్ హౌస్ ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్ వాదనలను వినిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News