ఫిట్ నెస్ లో ఇతడే నాకు పోటీ: సోనూ సూద్
- లాక్ డౌన్ నేపథ్యంలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్
- తాజాగా సోషల్ మీడియాలో తనయుడిపై పోస్టు
- కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోనూ
తాజాగా ఈ బాలీవుడ్ నటుడు ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టు విపరీతంగా సందడి చేస్తోంది. ఫిట్ నెస్ లో తనకు పోటీదారుడు దొరికాడంటూ తన కుమారుడు ఎషాన్ ఫొటో పోస్టు చేశారు. బాల్యంలో ఇషాన్ తనతో కలిసి ఉన్నప్పటి ఫొటో పంచుకున్నారు. ఎషాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సోనూ... ఇన్నాళ్లకు ఫిట్ నెస్ లో నాకు పోటీ ఇచ్చేవాడు వచ్చాడు అంటూ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా పోస్టు చేశారు.