China: ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారు: చినరాజప్ప

YSRCP Govt has done nothing to people says Chinarajappa
  • రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయి
  • విశాఖ భూముల కొనుగోళ్లపై విచారణ ఎందుకు జరపడం లేదు?
  • జనాల కోసం ప్రభుత్వం చేసిందేమీ లేదు
వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు పెరిగిపోయాయని టీడీపీ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. విశాఖపట్నంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసిందని... దీనిపై విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఈ భూముల వ్యవహారంపై విచారణ జరిపే దమ్ము జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు.

అమరావతిలో సీఆర్డీఏ హద్దులకు అవతల ఉన్న ప్రాంతాల్లోని భూములను కూడా రాజధాని భూములుగా విషప్రచారం చేస్తున్నారని చినరాజప్ప దుయ్యబట్టారు. ఎంతసేపూ టీడీపీపై బురదచల్లే కార్యక్రమాలే తప్ప...  ప్రజల కోసం వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు.
China
Telugudesam
Jagan
YSRCP
Amaravati

More Telugu News