Megapixel: 3,200 మెగాపిక్సెల్ కెమెరాతో ఫొటో తీస్తే ఎలావుంటుందో చూడండి!

US scientists achieves highest megapixel rate in the world
  • అమెరికా శాస్త్రజ్ఞుల అద్భుత ఆవిష్కరణ
  • ప్రపంచంలోనే అత్యధిక పిక్సెల్ రేటు ఇదే
  • ఖగోళ పరిశోధనలో ఉపయోగపడనున్న ఇమేజ్ సెన్సర్ టెక్నాలజీ
సాధారణంగా ఇప్పుడొస్తున్న స్మార్ట్ ఫోన్లలో అత్యధికంగా 13 మెగాపిక్సెల్ కెమెరాలను కలిగివుంటాయి. వాటి పరిధిలో నాణ్యమైన ఛాయాచిత్రాలను తీసే వీలుంది. కొన్ని స్మార్ట్ ఫోన్లలో 50 నుంచి 100 మెగాపిక్సెల్ సామర్థ్యం ఉన్నవి కూడా ఉంటాయి. కొన్ని ఖరీదైన కెమెరాల్లోనూ ఇదే స్థాయిలో పిక్సెల్ రేట్ ఉంటుంది. అయితే, అమెరికా ఇంధన శాఖకు చెందిన ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలరేటర్ ల్యాబ్ సైంటిస్టులు దిమ్మదిరిగే రీతిలో 3,200 మెగాపిక్సెల్ సాంకేతికతను అభివృద్ధి చేశారు.

దీని సాయంతో రోమనెస్కో బ్రోకోలీ అనే కూరగాయను ఫొటో తీయగా, అత్యున్నత నాణ్యతతో ఫొటోలు వచ్చాయి. ఈ ఫొటోలను ఇటీవలే విడుదల చేశారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇంతటి మెగాపిక్సెల్ రేటుతో తీసిన ఫొటోలు మరేవీ లేవు. ఈ సరికొత్త ఇమేజ్ సెన్సర్ సాయంతో ఈ ఫొటోలు తీశారు. మున్ముందు ఈ ఇమేజ్ సెన్సర్ ను ప్రపంచ అతిపెద్ద టెలిస్కోపిక్ కెమెరాలో ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఇలాంటి కెమెరానే ఎస్ఎల్ఏసీ ల్యాబ్ లోనూ అభివృద్ధి చేస్తున్నారు.

ఈ ఇమేజ్ సెన్సర్ ను కలిగివుండే శక్తిమంతమైన కెమెరాను చిలీలో ఏర్పాటు చేసిన లెగాసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ (ఎల్ఎస్ఎస్ టీ) ఖగోళ పరిశోధన కేంద్రంలో అమర్చనున్నారు. ఈ కెమెరాతో 40 చందమామలు పట్టేంత విస్తీర్ణాన్ని బంధించవచ్చు. మనిషి చూడలేని దానికంటే 100 రెట్లు తక్కువ చీకటిలోనూ చిత్రీకరణ చేసే సామర్థ్యం దీనికుందని చెబుతున్నారు.
Megapixel
SALC
USA
Image Sensor

More Telugu News