Jaya Bachchan: జయాబచ్చన్ మాటల్లో తప్పేముంది?: శివసేన

Whats wrong in Jaya Bachchans comments asks Shiv Sena
  • పార్లమెంటులో బాలీవుడ్ డ్రగ్స్ పై చర్చ
  • బాలీవుడ్ కు డ్రగ్స్ తో సంబంధం ఉందన్న రవికిషన్
  • ఎవరో చేసిన పనికి ఇండస్ట్రీని తప్పుపట్టొద్దన్న జయాబచ్చన్
బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారంపై పార్లమెంటులో ఈరోజు చర్చ జరిగింది. బాలీవుడ్ కు డ్రగ్స్ కు లింక్ ఉందని సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఆరోపించారు. సినీ పరిశ్రమను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

మరోవైపు అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ మాట్లాడుతూ, ఎవరో చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. ఈ నేపథ్యంలో, జయాబచ్చన్ కు శివసేన మద్దతుగా నిలిచింది. బాలీవుడ్ లో ప్రతి ఇక్కరికీ డ్రగ్స్ తో సంబంధం ఉందని అనడం సరికాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. జయాబచ్చన్ కూడా ఇదే అన్నారని... ఆమె మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు.

సినీపరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 5 లక్షల మంది బతుకుతున్నారని సంజయ్ రౌత్ అన్నారు. అలాంటి పరిశ్రమ గౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు చేసిన వ్యాఖ్యలను జయ తప్పుపట్టారని చెప్పారు. మరోవైపు జయాబచ్చన్ పై కంగనా రనౌత్ కూడా మండిపడ్డ సంగతి తెలిసిందే.
Jaya Bachchan
Ravi Kishan
Sanjay Raut
Bollywood
Shiv Sena

More Telugu News